<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
   చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
   నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

[V1]
 సంతోషం ఎక్కడ ఉందనీ
 సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
 జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
 చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి //

[V2]
 ప్రేమనేది ఎక్కడ ఉందనీ
 క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
 బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
 చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి //

[V3]
 సత్యమనేది ఎక్కడ ఉందనీ
 నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
 ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
 చివరికది నీలోనే కనుగొన్నాను (2) // ఎంత మంచి //</lyrics>
<title>ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా</title>
<hymn_number>52</hymn_number>
</song>